పనిచేసే వారికే గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

పనిచేసే వారికే గుర్తింపు

Dec 27 2025 9:47 AM | Updated on Dec 27 2025 9:47 AM

పనిచేసే వారికే గుర్తింపు

పనిచేసే వారికే గుర్తింపు

అనంతగిరి: పార్టీ కోసం పనిచేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం వికారాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ బలపర్చిన వారిని ప్రజలు ఆదరించారని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా ఇవే ఫలితాలు ఉంటాయన్నారు. జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారని తెలి పారు. పంచాయతీలకు త్వరలో ప్రత్యేక నిధులు కేటాయిస్తారని చెప్పారు. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీల్లో, మున్సిపల్‌ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేస్తామన్నారు. అనంతరం పీసీసీ వైస్‌ ప్రెసిడెంట్‌ వినోద్‌రెడ్డి, జనరల్‌ సెక్రటరీ రాంశెట్టి నరేందర్‌ మాట్లాడారు. త్వరలో జిల్లా కమిటీని ఏర్పాటుచేస్తామని, ఈ నెల 3, 4 తేదీల్లో ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. 3వ తేదీ ఉదయం తాండూరులో, మధ్యా హ్నం వికారాబాద్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 4వ తేదీ ఉదయం కొడంగల్‌, మధ్యాహ్నం పరిగిలో దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ఈ సారి పదవుల్లో 20 నుంచి 25 శాతం మహిళలకు అవకాశాలు ఇవ్వాలనుకుంటాన్నట్లు తెలిపారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్‌ మాట్లాడారు. జిల్లాలో ఏర్పాటు కానున్న కొత్త కమిటీతో పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఆనంద్‌ సీఎంపై చేసిన వ్యాఖ్యాలను ఖండించారు. భాష మార్చుకోవాల్సింది కేసీఆర్‌ అని హితవు పలికారు. సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌, వైస్‌ చైర్మన్‌ మల్లేశం, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ సత్యనారాయణ, మాజీ వైస్‌చైర్మన్‌ రమేష్‌కుమార్‌, డీసీసీబీ మాజీ డైరక్టర్‌ కిషన్‌నాయక్‌, నాయకులు రాంచంద్రారెడ్డి, గురువారెడ్డి, లక్ష్మణ్‌, శ్రీనివాస్‌, సర్పరాజ్‌, మోహన్‌, వేణుగోపాల్‌, మనోహర్‌ గౌడ్‌ పాల్గొన్నారు.

పరిగిని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

పరిగి: పరిగి పట్టణాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని బీసీ కాలనీలో రూ.9 లక్షల మున్సిపల్‌ నిధులతో సీసీ రోడ్డు, తుంకుల్‌గడ్డలో ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. త్వరలో పరిగికి రైలు మార్గం వస్తుందన్నారు. లక్నాపూర్‌ ప్రాజెక్టును టూరిజం స్పాట్‌గా తీర్చిదిద్దినట్లు చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పరశురాంరెడ్డి, వైస్‌ చైర్మన్‌ అయూబ్‌, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎర్రగడ్డపల్లి కృష్ణ, నాయకులు రామకృష్ణారెడ్డి, వెంకటేష్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

తిర్మలాపూర్‌ అభివృద్ధికి కృషి

పూడూరు: తిర్మలాపూర్‌ పంచాయతీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం గ్రామ నూతన సర్పంచ్‌ అనూష, ఉప సర్పంచ్‌ శ్రీను, వార్డు సభ్యుల అభినందన సభ నిర్వహించారు. కాంగ్రెస్‌ హయాంలోనే తండాలు అభివృద్ధి చెందాయన్నారు. విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆత్మకమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు రఘునాథ్‌రెడ్డి, సతీష్‌రెడ్డి, శ్రీనివాస్‌, రాములునాయక్‌, గోపాల్‌, మేగ్యారాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి

త్వరలో కాంగ్రెస్‌ జిల్లా కమిటీ ఏర్పాటు

3, 4 తేదీల్లో దరఖాస్తుల స్వీకరణ

పీసీసీ వైస్‌ ప్రెసిడెంట్‌ వినోద్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement