ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం
సీపీఐ జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి
అనంతగిరి: ప్రజా సమస్యలపై సీపీఐ నిరంతరం పోరాటం చేస్తుందని జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి పండిత్ అన్నారు. పార్టీ ఆవిర్భవించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం వికారాబాద్‌లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నో త్యాగాలు, బలిదానాలు చేసిన చరిత్ర సీపీఐ నాయకులకు ఉందన్నారు. సమాజంలోని పేదలు, విద్యార్థులు, రైతులు, మహిళలు, కార్మిక లోకం కోసం ముందుండి పోరాడుతుందన్నారు. ఎంతో మంది సీనియర్ నాయకుల త్యాగాల ఫలితంగానే నేడు ముందుకు సాగుతోందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్రంపై పోరాటంలో భాగంగా ప్రజలను భాగస్వాములను చేస్తామని పేర్కొ న్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఏసురత్నం, గోపాల్‌రెడ్డి, రావుఫ్, అనంతయ్య, పీర్ మహముద్, అబ్దుల్లా, వెంకటేష్, సురేష్, జగదాంబ, విమలమ్మ, ఖాదర్, హనుమంతు, బీరయ్య, నర్సింలు పాల్గొన్నారు.


