‘మరాటి’కి డాక్టరేట్
తాండూరు టౌన్: మండలంలోని నారాయణపూర్‌కు చెందిన తెలుగు అధ్యాపకుడు మరాటి నర్సింలు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా పొందారు. ప్రస్తుతం ఆయన రంగారెడ్డి జిల్లాలోని బీహెచ్‌ఈఎల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. ‘వికారాబాద్ జిల్లా మాండలికం – పరిశీలన’ అనే అంశంపై ఆచార్య వెలుదండ నిత్యానందరావు పర్యవేక్షణలో పరిశోధన చేసి ఓయూ తెలుగు శాఖ వారు నిర్వహించిన మౌఖిక పరీక్షను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. నర్సింలును ఓయు తెలుగు శాఖాధ్యక్షుడు ఆచార్య సాగి కమలాకరశర్మ, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్ డాక్టర్ విజయలక్ష్మి, పరీక్షకులు డాక్టర్ రఘు, వెలుదండ నిత్యానందరావు, డాక్టర్ కె నారాయణమూర్తి అభినందించి తుది పరిశోధనా గ్రంథాన్ని అందజేశారు.


