అంతర్జాతీయ సైన్స్ వేడుకకు దాదాపూర్ ఉపాధ్యాయుడు
దోమ: అంతర్జాతీయ సైన్స్ వేడుకలకు దాదాపూర్ జీవశాస్త్ర ఉపాధ్యాయుడు శాంతుకుమార్ ఎంపికయ్యారు. అంతర్జాతీయ వేడుకకు రెండోసారి ఎంపికవ్వడంతో ఆయన్ను ఉపాధ్యాయులు అభినందించారు. బోధన అనుభవం, వినూత్న బోధన పద్ధతుల ఉపయోగం, ప్రయోగాల నిర్వహణ, పాఠశాలలో జరిగే వివిధ కార్యక్రమాలు, విద్యార్థుల విజ్ఞాన ప్రదర్శనతో పాటు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ నెల 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు చండీగఢ్‌లో నిర్వహించనున్న అంతర్జాతీయ సైన్స్ వేడుకలకు ఆయన్ను ఎంపిక చేశారు.
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య
అనంతగిరి: తెలంగాణ తొలిదశ ఉద్యమసారథి మర్రి చెన్నారెడ్డి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన వేసిన ముద్ర చెరగనిదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం చెన్నారెడ్డి వర్ధంతి సందర్భంగా వికారాబాద్‌లో ఆయన విగ్రహానికి పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు అభిమానులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, ఎస్‌ఏపీ కళాశాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ప్రాథమిక ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మురళీధర్‌గౌడ్
పరిగి: ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులను స్కూల్ అసిస్టెంట్ స్థాయికంటే ఎక్కువ స్థాయిలో ఎన్నికల విధుల్లో నియమించాలని ప్రాథమిక ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మురళీధర్‌గౌడ్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు తాను నిరంతరం కృషి చేస్తున్నానన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ఎఫ్‌ఎల్‌ఎస్ కార్యక్రమాన్ని పరిశీలించడానికి పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులచే టీంలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఆనంద్‌కుమార్, రాష్ట్ర నాయకులు ఉస్మాన్ అలీ, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్
అనంతగిరి: సీఐటీయూ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ అన్నారు. ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు మెదక్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న సభలకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను మంగళవారం సీఐటీయూ సంఘం నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. కార్మికుల సమస్యల పరిష్కారంలో సీఐటీయూ ముందుంటుందన్నారు. జిల్లా నుంచి పెద్ద ఎత్తున కార్మికులు హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కోశాధికారి చంద్రయ్య, ఉపాధ్యక్షురాలు నర్సమ్మ, మైపాల్, సుదర్శన్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ సైన్స్ వేడుకకు దాదాపూర్ ఉపాధ్యాయుడు
అంతర్జాతీయ సైన్స్ వేడుకకు దాదాపూర్ ఉపాధ్యాయుడు
అంతర్జాతీయ సైన్స్ వేడుకకు దాదాపూర్ ఉపాధ్యాయుడు


