ఒక్కటే నామినేషన్.. వారే సర్పంచ్
మోమిన్‌పేట: మండల పరిధిలోని మూడు గ్రామ పంచాయితీల సర్పంచ్, వార్డు సభ్యులు ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. 29 పంచాయితీల్లో నామినేషన్ల చివరి రోజు మంగళవారం మూడు పంచాయితీలకు ఒకే నామినేషన్ దాఖలయ్యాయి. చీమల్‌ధరి జనరల్ (మహిళ)కు రిజర్వు కాగా ఎల్లకొండ కల్పనా రెడ్డి, చిన్న కోల్కుంద బీసీ(మహిళ)కు రిజర్వు కాగా బాషెట్టి విశాల, అంరాధి కుర్దు జనరల్ రిజర్వు కాగా పురుషోత్తంరెడ్డి సర్పంచ్, వార్డు సభ్యులకు ఒక్కొక్కరు మాత్రమే నామినేషన్ వేయడంతో ఎకగ్రీవం లాంఛనమైంది.
అవుసుపల్లి, పీసీఎం తండా, నాగ్‌సాన్‌పల్లిలో..
ధారూరు: మండల పరిధిలోని మూడు పంచాయతీల్లో సర్పంచులు ఏకగ్రీవం కానున్నట్లు తెలిసింది. నామినేషన్ల చివరి రోజు వరకు అవుసుపల్లి నుంచి మహేష్‌యాదవ్, పీసీఎంతండా జీపీలో బాలునాయక్, నాగ్‌సాన్‌పల్లి పంచాయతీకి పాశం సత్యనారాయణ ఒక్కొక్కరే నామినేషన్లు వేశారు. కొండాపూర్‌ఖుర్దు జీపీ ముందుగా ఏకగ్రీవం రూ.6.50 లక్షలకు కాగా ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగి ఒకరు రూ.15లక్షలు ఇస్తానని ముందుకు రావడంతో ఏకగ్రీవం కాస్తా పోటీకి సిద్దమైనట్లు తెలిసింది.
మహేష్‌యాదవ్, అవుసుపల్లి
ఎల్లకొండ కల్పనారెడ్డి, చీమల్‌ధరి
బాలునాయక్, పీసీఎం తండా
బాషెట్టి విశాల, చిన్న కోల్కుంద
సత్యనారాయణ, నాగ్‌సాన్‌పల్లి
పురుషోత్తంరెడ్డి, అంరాధి కుర్దు
రెండు మండలాల్లో ఆరు పంచాయతీలు యునానిమస్
ఒక్కటే నామినేషన్.. వారే సర్పంచ్
ఒక్కటే నామినేషన్.. వారే సర్పంచ్
ఒక్కటే నామినేషన్.. వారే సర్పంచ్
ఒక్కటే నామినేషన్.. వారే సర్పంచ్
ఒక్కటే నామినేషన్.. వారే సర్పంచ్


