డీసీసీ అధ్యక్షుడికి నియామకపత్రం
తాండూరు: కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ధారాసింగ్ జాదవ్ మంగళవారం నియామకపత్రం అందుకున్నారు. మంగళవారం గాంధీ భవన్‌లో పీసీసీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశం ముగిసిన అనంతరం ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షినాటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ ఆయనకు నియామక పత్రం అందజేశారు. తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన అగ్రనేతలకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా పనిచేస్తానన్నారు.
అనంతగిరి: వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం మంగళవారం బాధ్యతలు చేపట్టింది. మార్కెట్ కమిటీ చైర్మన్‌గా చాపల శ్రీనివాస్ ముదిరాజుతో పాటు వైస్‌చైర్మన్‌గా మల్లేశం, సభ్యులుగా పాపిరెడ్డి, రమేశ్, రాజు, అర్చన, భీమయ్య, విజేందర్‌రెడ్డి, పాండురంగారెడ్డి, నాగిరెడ్డి, రంగారెడ్డి, ప్రభాకర్, నర్సింలు, సురేందర్‌లు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం వారు అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్‌ను వికారాబాద్‌లోని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. రైతుల సంక్షేమానికి కృషి చేస్తానన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, ఆర్‌టీఏ సభ్యుడు ఎర్రవల్లి జాఫర్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మైపాల్‌రెడ్డి, ముత్తాహర్‌షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.
డీసీసీ అధ్యక్షుడికి నియామకపత్రం


