అవకతవకలకు పాల్పడితే చర్యలు
పరిగి: కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు పంపాలని అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ సూచించారు. మంగళవారం ఆయన మండల పరిధిలోని సుల్తాన్‌పూర్, గడిసింగాపూర్, రంగంపల్లి గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సెంటర్లలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలన్నారు. అవకతవకలకు పాల్పడే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా నిత్యం గన్నీ బస్తాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రతి రోజు లారీలు అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులకు సూచించారు. రైతులు ధాన్యం విక్రయించిన వారం గడువులోపు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని చెప్పారు. దళారులను నమ్మి రైతులు మోసపోద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలన్నారు.
అదనపు కలెక్టర్ లింగ్యానాయక్


