ఇద్దరు పిల్లలతో తల్లి అదృశ్యం
● మీర్‌పేట పీఎస్ పరిధిలో ఘటన
● మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు
మీర్‌పేట: భర్తతో గొడవపడిన భార్య ఇద్దరు కుమార్తెలతో ఇంటి నుంచి బయటకు వెళ్లి, కనిపించకుండాపోయిన ఘటన మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ సత్యనారాయణరెడ్డి కథనం ప్రకారం. బిహార్ రాష్ట్రానికి చెందిన మహబూబ్‌పాషా, ప్రీతికుమారి(23) భార్యాభర్తలు. బతుదుదెరువు కోసం నగరానికి వచ్చి మూడేళ్లుగా బడంగ్‌పేట న్యూబృందావన్ నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు ఇద్దరు కుమార్తెలు నబా (3), సూఫీ (2)లు ఉన్నారు. నవంబరు 26న భార్యభర్తల మధ్య గొడవ జరగడంతో మనస్తాపం చెందిన ప్రీతి తన ఇద్దరు కుమార్తెలను తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. స్థానికంగా ఉండే బంధువులకు, బిహార్‌లోని స్వగ్రామానికి ఫోన్ చేసి కుటుంబ సభ్యులను వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో మహబూబ్‌పాషా సోమవారం మీర్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
ఇద్దరు పిల్లలతో తల్లి అదృశ్యం
ఇద్దరు పిల్లలతో తల్లి అదృశ్యం
ఇద్దరు పిల్లలతో తల్లి అదృశ్యం


