గుర్తులు వచ్చేశాయ్!
ఉంగరం..కత్తెర..బ్యాట్..ఫుట్‌బాల్..లేడీ పర్సు తదితరాలు సర్పంచ్ అభ్యర్థులకు 30, వార్డు సభ్యులకు 20 రకాల సింబల్స్ బ్యాలెట్‌లో నోటాకూ చోటు
సర్పంచ్ అభ్యర్థుల గుర్తులు
బషీరాబాద్: పార్టీ రహితంగా జరిగే పంచాయ తీ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ గుర్తులు కేటాయించింది. సర్పంచ్‌గా పోటీ చేసే అభ్యర్థుల కు అనుబంధం ఒకటిలో 30 గుర్తులు కేటాయించారు. అనుబంధం 2లో వార్డు సభ్యులకు 20 రకాల గుర్తులు పొందుపరిచారు. అయితే బ్యాలెట్ పేపర్‌లో చివరి గుర్తుగా నోటా(పై వేవి కావు) అనే సింబల్‌ను ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు జిల్లాలో మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ రేపటితో ముగియనుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితా డిసెంబర్ 3న విడదల చేయడంతో పాటు పోటీదారులకు గుర్తులు కేటాయిస్తారు. డిసెంబర్ 11న మొద టి విడతలో 262 పంచాయతీలకు, 2,198 వార్డుల కు పోలింగ్ జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు చకచకా చేస్తున్నారు.
వార్డుసభ్యుల గుర్తులు
వార్డు సభ్యులను ఎన్నుకునేందుకు బ్యాలెట్ పత్రంలో గౌను, గ్యాస్ పొయ్యి, స్టూల్, గ్యాస్ సిలిండర్, బీరువా, ఈల, కుండ, డిష్ యాంటీ నా, గరాటా, మూకుడు, ఐస్ క్రీం,గాజు గ్లాసు, పోస్టుడబ్బా, కవ ర్, హాకీ కర్ర బంతి, నెక్ టై, కటింగ్ ప్లేయర్, పెట్టె, విద్యుత్ స్తంభం, కేటిల్ గుర్తులను కేటాయించారు. ఈ గుర్తుల బ్యాలెట్ పత్రాల ముద్రణకు జిల్లా ఎన్నికల అధికారి టెండర్లు పిలువనున్నారు.
సర్పంచ్ అభ్యర్థి గుర్తులివే..
ఉంగరం, కత్తెర, బ్యాట్, ఫుట్ బాల్, లేడీ పర్సు, టీవీ, రిమోట్, టూత్ పేస్ట్, స్పానర్, చెత్త డబ్బా, నల్ల బోర్డు, బెండకాయ, కొబ్బ రి తోట, వజ్రం, బకెట్, డోర్ హ్యాండిల్, టీ జల్లెడ, చేతి కర్ర, మంచం, పలక, టేబుల్, బ్యాటరీ లైట్, బ్రష్, బ్యాట్స్‌మాన్, మనిషి మరియు తెరచాపతో కూడిన పడవ, బిస్కట్, వేణువు, చెయిన్, చెప్పులు, గాలి బుడగ, స్టంప్స్ గుర్తులు ఉన్నాయి.
గుర్తులు వచ్చేశాయ్!


