నాపరాతి పరిశ్రమకు సహకారం
తాండూరు: నాపరాతి పరిశ్రమ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు స్టోన్ మర్చంట్, క్వారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోషియేషన్‌ల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. తాండూరు నాపరాతి నిక్షేపాలకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికత జోడించి నాపరాయిని మెరుగు పర్చాలన్నారు. తాండూరు పట్టణంలో లారీల పార్కింగ్‌కు స్థలం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అందుకోసం స్థలం కేటాయించడం జరిగిందన్నారు. టీజీ ఐఐసీ ద్వారా ఆటోనగర్‌ను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. తాండూరు స్టోన్ మర్చంట్ వెల్ఫేర్ అసోషియేషన్ అధ్యక్షుడిగా నయిం, ఉపాధ్యక్షులుగా సత్తార్, విజయరామారావు, ప్రధాన కార్యదర్శిగా కుంచం మురళీధర్, సంయుక్త కార్యదర్శులుగా సయ్యద్ హబీబ్‌లాల, బ్రిజ్ మోహన్ బూబ్, ట్రెజరర్‌గా సంజీవ్‌కుమార్ తోపాటు కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. క్వారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోషియేషన్ అధ్యక్షుడిగా అబ్దుల్ రవూఫ్, ఉపాధ్యక్షులుగా ఓం ప్రకాష్ సోమాని, మహ్మద్ అన్వర్ అహ్మద్, ప్రధాన కార్యదర్శిగా సయ్యద్ జుబేర్ పాష, సంయుక్త కార్యదర్శులుగా శరణుబసప్ప, హర్షవర్దన్‌రెడ్డి, ట్రెజరర్‌గా మహ్మద్ జైనుద్దిన్ తోపాటు కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో గనుల శాఖ ఏడీ సత్యనారాయణ, డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్ జాదవ్, నాయకులు డాక్టర్ సంపత్‌కుమార్, అజయ్‌ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


