రేపటి నుంచి రెండో విడత నామినేషన్ల ప్రక్రియ
అనంతగిరి: పంచాయతీ ఎన్నికల రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ఆదివారం ప్రారంభమవుతుందని ఎంపీడీఓ వినయ్‌కుమార్ తెలిపారు. శుక్రవారం కార్యాలయ ఆవరణలో ఆర్‌ఓ, ఏఆర్‌ఓలు, పంచాయతీ కార్యదర్శులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల నియమావళి ప్రకారం నామినేషన్ ప్రక్రియ చేపట్టాలన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే వెంటనే తమ దృష్టికి తేవాలన్నారు. అనంతరం మాస్టర్ ట్రైనర్లు నియమావళిపై, దర ఖాస్తుల ప్రక్రియపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీఓ దయానంద్, ఎంఈఓ బాబు సింగ్, సూపరింటెండెంట్ శాంత పాల్గొన్నారు.


