ఏకగ్రీవ పంచాయతీలకు.. | - | Sakshi
Sakshi News home page

ఏకగ్రీవ పంచాయతీలకు..

Nov 28 2025 11:35 AM | Updated on Nov 28 2025 11:41 AM

ఏకగ్రీవ పంచాయతీలకు..

ఏకగ్రీవ పంచాయతీలకు..

ఏకగ్రీవ పంచాయతీలకు.. బషీరాబాద్‌: ఏకగ్రీవ పంచాయతీల అభివృద్ధికి రూ.20 లక్షలు నజరానా ఇస్తానని తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ప్రకటించారు. వెయ్యిలోపు జనాభా ఉండే జీపీలు ఏకగ్రీవం చేస్తే రూ.10 లక్షలు కేటాయిస్తామన్నారు. ఈ నిధులు ఎమ్మెల్యే కోటా కింద మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. గురువారం మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రజాబలం ఉన్న వారినే సర్పంచ్‌ అభ్యర్థిగా ఎంపిక చేయాలని సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నందున పార్టీ అభ్యర్థులను గెలిస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, ఈ విషయాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. నాయకులు గ్రూపులుగా విడిపోతే అభ్యర్థులకు, పార్టీకి న ష్టం జరుగుతుందని, ఐక్యంగా పనిచేసి సర్పంచులను గెలిపించుకోవాలని కోరారు. కాంగ్రెస్‌ వచ్చాక రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు. పేదలకు ఉచిత విద్యుత్‌, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ చీరలు వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేసి అభ్యర్థులు విజయానికి కృషి చేయాలని ఆదేశించారు. మంతన్‌గౌడ్‌ గ్రామానికి చెందిన ఎరుకలి భీమప్ప కుటుంబం ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆ గ్రామం ఎస్టీకి రిజర్వు కావడంతో గ్రామంలో ఏకైక కుటుంబంగా ఉన్న భీమప్ప, అతడి కొడుకులు ఎల్లప్ప, మహేష్‌ హస్తం గూటికి చేరడంతో ఆ పంచాయతీ హస్తగతం అయ్యిందని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అన్నారు. వీరితోపాటు గ్రామంలోని పలువురు యువకులు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కలాల్‌ నర్సింలు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మాధవరెడ్డి, సొసైటీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ వెంకట్‌రామ్‌రెడ్డి, అజయ్‌ప్రసాద్‌, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు జానకీ, సీనియర్‌ నాయకులు సత్యనారాయణరెడ్డి, వెంకటేష్‌ మహరాజ్‌, రాకేష్‌ మహరాజ్‌, శంకర్‌రెడ్డి, శంకరప్ప, ప్రణయ్‌రెడ్డి, చందర్‌, మాణిక్‌రావు, సిద్ధార్థ్‌ తదితరులు పాల్గొన్నారు. యాలాల: మండలంలోని ముద్దాయిపేట గ్రామానికి చెందిన పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. గ్రామానికి చెందిన పంతుల రాజప్ప, పంతుల శేఖర్‌, రుద్రమణి తదితరులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ సొసైటీ చైర్మన్‌ సురేందర్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు నర్సిరెడ్డి, ఇందిరమ్మ గ్రామ కమిటీ సభ్యులు దేవగారి రమేష్‌, వాసిద్‌ ఖాన్‌, నర్సింహులు, బస్వరాజ్‌, జహంగీర్‌, రవి, మురళీగౌడ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, రాజుగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ గూటికి..

బీఆర్‌ఎస్‌ నాయకుల చేరిక

తాండూరు రూరల్‌: నాయకులు, కార్యకర్తలు గ్రూపులుగా విడిపోతే పార్టీ పరంగా నష్టపోతామని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని అంతారం తండాలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ బలపర్చిన ఒక్కరే సర్పంచ్‌ అభ్యర్థిగా ఉండాలన్నారు. గ్రూపులుగా విడిపోయి ఎవరికి వారు అభ్యర్థులను బరిలో ఉంచరాదని సూచించారు. అనంతరం పెద్దేముల్‌లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మీరే సర్పంచ్‌ అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నాయకుడు ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

విడిపోతే నష్టపోతాం

రూ.20 లక్షల నజరానా

తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి

అధికార పార్టీ సర్పంచులు ఉంటేనే అభివృద్ధి సాధ్యం

బషీరాబాద్‌లో పార్టీ ముఖ్యనాయకులతో భేటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement