జిల్లా కేంద్రాన్ని విస్మరించడం తగదు
అనంతగిరి: సీఎం రేవంత్‌రెడ్డి అభివృద్ధి విషయంలో జిల్లా కేంద్రమైన వికారాబాద్‌ను విస్మరించడం తగదని బీఆర్‌ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గోపాల్ ముదిరాజ్ అన్నారు. వికారాబాద్‌ను సెంటర్ పాయింట్‌గా చేసుకొని అభివృద్ధి చేస్తే అన్ని నియోజకవర్గాలు పురోగతి సాధిస్తాయని పేర్కొన్నారు. మంగళవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లా కేంద్రాన్ని కాదని తన సొంత నియోజకవర్గం కొడంగల్‌కే ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆరోపించారు. దీనిపై జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సైతం అడగకపోవడం సరికాదని హితవు పలికారు. ఎన్నికల సమయంలో అనంతగిరిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్న సీఎం ఇప్పటివరకు చేసిందేమీ లేదన్నారు. రాష్ట్ర రాజధానికి 60 కిమీల దూరంలో ఉన్న వికారాబాద్‌ను కాదని కొడంగల్‌ను మాత్రమే అభివృద్ధి చేయడం ఏమిటని ప్రశ్నించారు. కొడంగల్‌తో పాటు వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాలను కూడా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అధికార పక్షాన్ని నిలదీయాల్సింది పోయి ప్రతిపక్షంలోని బీఆర్‌ఎస్‌ను విమర్మించడాన్ని బట్టి చూస్తే కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని తెలిపోయిందన్నారు. సమావేశంలో పార్టీ పట్టణ వర్కింగ్ ప్రసిడెంట్ సుభాన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్, ధారూర్ మండల అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి, సీనియర్ నాయకులు దేవదాసు, మండల వర్కింగ్ ప్రసిడెంట్ అశోక్, మైనార్టీ విభాగం మండల అధ్యక్షుడు గయాజ్, పట్టణ అధ్యక్షుడు ముర్తుజాలీ, నాయకులు మల్లేశం, లక్ష్మయ్య, రమణ, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.


