
రైతులకు యూరియా అందించాలి
కొడంగల్ రూరల్: రైతాంగానికి సరిపడా యూరియా అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కార్యదర్శి గంటి సురేష్‌కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో రైతు సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ బి.విజయకుమార్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు యూరియా అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఫర్టిలైజర్స్ దుకాణదారులు యూరియా కొరత సృష్టిస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ఆశమ్మ, రాజునాయక్, శైలజ, శంకర్‌నాయక్, బాబ్యనాయక్, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర రైతు సంఘం జిల్లా కార్యదర్శిసురేష్‌కుమార్