
ఆదర్శ రైతుకు అభినందన
కొడంగల్ రూరల్: వైవిద్య పంటలను సాగుచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న రైతును వ్యవసాయాధికారులు అభినందించారు. మండల పరిధిలోని పర్సాపూర్ గ్రామానికి చెందిన కొల్లేర్ నవీన్ సమగ్ర వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సోమవారం మండల వ్యవసాయాధికారి జి.తులసి, ఏఈఓలు అశ్విని, శ్రీపతి, ఐజాక్ హెరాల్డ్, రాజులతో కలిసి రైతు నవీన్ సాగుచేస్తున్న వివిధ రకాల పంటలను పరిశీలిస్తూ అభినందించారు. నాలుగున్నర ఎకరాల పొలంలో మొత్తం 13 రకాల పంటలను సాగుచేస్తున్నట్లు గుర్తించారు. పెసర, సెనగలు, కందులు, పల్లీలు, కందులు వరుసలుగా వేయగా, నువ్వులు, బంతి, ప్రొద్దుతిరుగుడు పంటలను సాగు చేస్తున్నాడు. రైతు నవీన్‌పై మండల వ్యవసాయాధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.