
లగోరి పోటీల్లో విద్యార్థుల సత్తా
దోమ: మహారాష్ట్ర రాష్ట్రంలోని చిప్నూర్ నగరంలో ఇటీవల జరిగిన జాతీయ స్థాయి లగోరి పోటీల్లో జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. 22 రాష్ట్రాల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనగా రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా పరిధిలో ఉన్న దిర్సంపల్లి, ముజాహిద్‌పూర్, రాంనగర్, నారాయణపేట జిల్లాలోని కోస్గీకి చెందిన విద్యార్థులు పాల్గొని ద్వితీయ స్థానంలో నిలిచారని రాష్ట్ర లగోరి అసోసియేషన్ కార్యదర్శి పి.నవీన్‌కుమార్ తెలిపారు. కార్యక్రమంలో లగోరి చాంపియన్‌షిప్ హెడ్ కోచ్‌లు ఎం.విశాల్, సచిన్ మహిళా కోచ్ నవనీత తదితరులు పాల్గొన్నారు.