
అల్లాపూర్‌లో ఆధ్యాత్మిక శోభ
తాండూరు రూరల్: మండల పరిధిలోని అల్లాపూర్ గ్రామంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. శ్రావణమాసం ముగింపు సందర్భంగా సోమవారం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పల్లకిలో గ్రామంలో ఊరేగింపు చేపట్టారు. ప్రత్యేక కీర్తనలు, భజనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామస్తులు అమర్‌నాథ్‌గౌడ్, విజయ్ కుమార్, గోపాల్‌రెడ్డి, పెద్ద నర్సిములుగౌడ్, నర్సిరెడ్డి, కిషోర్‌గౌడ్, ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.