
విద్యుదాఘాతంతో గేదె మృతి
తాండూరు రూరల్: విద్యుదాఘాతంలో ఓ గేదె మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని చెంగోల్‌లో చోటు చేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వడ్ల మోనప్ప గేదెను అల్లాపూర్ శివారులోని ఓ పొలంలో మేతకు సోమవారం తీసుకెళ్లాడు. ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంలో అది అక్కడికక్కడే మృతి చెందింది. గేదె విలువ సుమారు రూ.లక్ష వరకు ఉంటుందని బాధితుడు వాపోయాడు.
విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
మోమిన్‌పేట: విద్యార్థులు క్రీడల్లో రాణించాలని పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండల పరిధిలోని టేకులపల్లి ఉన్నత పాఠశాలలో 69వ ఎస్‌జీఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలలో రానిస్తే భవిష్యత్‌లో మంచి అవకాశాలు ఉంటాయన్నారు. ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉంటాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ మల్లేశం, ప్రదానోపాధ్యాయులు గౌరిశంకర్ తదితరులు ఉన్నారు.
ఇన్‌చార్జి ఎంపీఓగా వీరన్న
తాండూరు రూరల్: మండల పంచాయతీ అధికారి(ఎంపీఓ) ఇన్‌చార్జిగా వీరన్న బాధ్యతలు సోమవారం చేపట్టారు. గతంలో పని చేసిన ఎంపీఓ సుశీల్‌కుమార్ వికారాబాద్ కలెక్టర్ కార్యాలయంలో డీఆర్‌డీఏకు బదిలీపై వెళ్లారు. దీంతో చెన్‌గేస్‌పూర్ పంచాయతీ కార్యదర్శి వీరన్నకు ఇన్‌చార్జి ఎంపీఓగా నియమిస్తూ డీపీఓ ఆదేశాలు జారీ చేశారు. ఎంపీడీఓ విశ్వప్రసాద్ సహకారంతో మండల అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
వనమహోత్సవానికి సిద్ధం
దుద్యాల్: వన మహోత్సవానికి అధికారులు సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా మండల పరిధిలోని హస్నాబాద్ గ్రామంలో సోమవారం కొత్తగా మొక్కలు నాటేందుకు ఉపాధి కూలీలు గుంతలు తీశారు. ప్రధాన రోడ్ల గుండా పచ్చదనం ఉట్టి పడేలా ప్రజలకు స్వచ్ఛమైన గాలి అందుతుందనే భావనతో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పనులను గ్రామ పంచాయతీ కార్యదర్శి కృష్ణవేణి, ఏపీఎం రాములు పరిశీలించారు.
అనుమతి ఇవ్వండి
కుల్కచర్ల: విద్యార్థుల ఇష్టానుసారంగా వినాయక ప్రతిమను పెట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలని బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు వెంకటయ్యముదిరాజ్, దిశ కమిటీ జిల్లా సభ్యుడు జానకిరాం అన్నారు. సోమవారం ముజాహిద్‌పూర్ మోడల్ స్కూల్‌లో ప్రిన్సిపాల్ జ్యోతిహెప్సిభా ను కలిసి విద్యార్థుల మనోభావాలను గౌరవించాలని సూచించారు. ఏటా నిర్వహించుకునే పండగను కొత్తగా నిరాకరించడం సమంజసం కాదన్నారు. కార్యక్రమంలో బిచ్చయ్య, నరేష్, మహేష్, విజయేందర్‌రెడ్డి, మల్లేష్, వెంకటేష్, శివకుమార్, జస్వంత్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
క్షయపై అప్రమత్తంగా ఉండాలి
బంట్వారం: క్షయపై అప్రమత్తంగా ఉండాలి కోట్‌పల్లి పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ మేఘన అన్నారు. టీబీ ముక్త్‌భారత్ అభియాన్‌లో భాగంగా సోమవారం కోట్‌పల్లి, అన్నాసాగర్, ఇందోల్, ఓగులాపూర్ గ్రామాల్లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె హాజరై మాట్లాడారు. టీబీ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆమె ప్రజలకు వివరించారు. అనంతరం పలువురిని వ్యాధి నిర్ధారణ పరీక్షలకు తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. కార్యక్రమంలో సీహెచ్‌ఓ ఖయూం, ఎంఎల్‌హెచ్‌పీ దివ్య, స్థానిక ఎఎన్‌ఎం అపర్ణ, ఎల్టీ నర్సింహ, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

విద్యుదాఘాతంతో గేదె మృతి

విద్యుదాఘాతంతో గేదె మృతి

విద్యుదాఘాతంతో గేదె మృతి

విద్యుదాఘాతంతో గేదె మృతి