
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పరిగి: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీజేపీ పార్టీ మండల అధ్యక్షురాలు నీరటి అనసూయ ఆరోపించారు. సోమవారం పట్టణ కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ప్రజా సమస్యలపై తహసీల్దార్ వెంకటేశ్వరికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పరిగి మండలంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఎన్నికల్లో నస్కల్ రోడ్డులోని చిన్న వాగు బ్రిడ్జీ నిర్మాణం చేస్తామని చెప్పి ఇప్పటి వరకు పనులు చేయడం లేదన్నారు. ప్రజా సమస్యలపై బీజేపీ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యలపై ర్యాలీ
ధారూరు: ప్రజా సమస్యలపై బీజేపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈమేరకు సోమవారం తహసీల్దార్ సాజిదాబేగంకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ.. ధారూరులో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని, ధారూరు–చింతకుంట గ్రామాల మధ్య వాగుపై నిర్మించిన అసంపూర్తి వంతెనను పూర్తి చేయాలని తదితర సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వీడడం లేదన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రాజునాయక్, జిల్లా దిశ కమిటీ సభ్యుడు వడ్లనందు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సమస్యలపై బీజేపీ నేతల ఫిర్యాదు
బంట్వారం: గ్రామాల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీజేపీ నాయకులు సోమవారం బంట్వారం, కోట్‌పల్లి తహసీల్దార్ కార్యాలయాల్లో వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆర్‌అండ్‌బీ రోడ్లు అధ్వానంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. అలాగే గ్రామాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా తయారయిందన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు మహేష్, శివకుమార్, ప్రధాన కార్యదర్శి మల్లేశం, నాయకులు వెంకటేశంగౌడ్, నందు, పాండుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
రోడ్లకు మరమ్మతులు చేపట్టాలి
యాలాల: మండలంలో దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ విషయమై సోమవారం మండల కేంద్రం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మండలంలో ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్ రోడ్లు దెబ్బతిని వాహనదారులు, ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో పార్టీ మండల అధ్యక్షుడు శివకుమార్, నాయకులు విజయ్‌కుమార్, అశోక్, దస్తప్ప, యాదగిరి తదితరులు ఉన్నారు.
బీజేపీ నాయకుల ధ్వజం

హామీల అమలులో కాంగ్రెస్ విఫలం

హామీల అమలులో కాంగ్రెస్ విఫలం