
సంతకం పెట్టను!
ధారూరు: వారం రోజుల నుంచి తిరుగుతున్నాం.. నోడ్యూ సర్టిఫికెట్‌పై సంతకం పెట్టండి సార్ అంటూ రైతులు బ్యాంకు మేనేజర్‌కు మొరపెట్టుకున్నారు. సంతకం పెట్టాలన్న రూలేమైనా ఉందా, తర్వాత చూస్తానులే అంటూ దబాయించిన సంఘటన మండల పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కొంతమంది రైతులు వివిధ రకాల రుణాల తీసుకునేందుకు ఆయా బ్యాంకుల నుంచి నోడ్యూ సర్టిఫికేట్ అవసరం. దాని కోసం దీనికి నాగారం తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్‌కు ఆశ్రయించగా.. రైతులకు చుక్కలు చూపిస్తున్నారు. నిత్యం రేపుమాపంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఇదేంటని కొందరు ప్రశ్నిస్తే మీ దిక్కున్న చోట చెప్పుకోండి సమాధానం ఇవ్వడంతో అన్నదాతలు నిశ్చేష్టులయ్యారు. వాస్తవానికి నోడ్యూ సర్టిఫికెట్‌ను కోరితే నిమిషాల్లో చెక్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ రోజుల తరబడి తిప్పుకోవడంపై కర్షకులు కె.వెంకటయ్య, సీహెచ్.యాదయ్య, క్రిష్ణ, యాదయ్య, పాషం.క్రిష్ణయ్య మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే జిల్లా కలెక్టర్‌కు సైతం ఫిర్యాదు చేశారు. ఈ విషయమై బ్యాంక్ మేనేజర్ రమేశ్‌ను వివరణ కోరగా.. ఏ రైతుతో అలా మాట్లాలేదన్నారు. కొందరు కావాలనే ఇలా చేస్తున్నారన్నారు. రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత నోడ్యూ సర్టిఫికెట్లపై సంతకాలు పెడుతున్నానని తెలిపారు. వివిధ పనుల్లో ఉన్నప్పుడు సంతకాలు పెట్టమని ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు.
నోడ్యూ సర్టిఫికెట్‌కు రోజుల తరబడి తిప్పుకొంటున్న బ్యాంక్ మేనేజర్