
సత్యాగ్రహ దీక్షలో బీసీ నేతలు
అనంతగిరి: స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ సోమవారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ. ఆర్ కృష్ణయ్య చేపట్టిన సత్యగ్రహ దీక్షకు జిల్లా నుంచి బీసీ నాయకులు తరలివెళ్లారు. ఇందులో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీఆర్ కృష్ణ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తరలివెళ్లిన బీసీ నాయకులు
తాండూరు టౌన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద బీసీ సంఘం జాతీయాధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తలపెట్టిన సత్యాగ్రహ దీక్షలో సోమవారం పలువురు తాండూరు బీసీ నాయకులు పాల్గొన్నారు. ఈసందర్భంగా బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ షుకూర్ తదితరులు ఆయనను కలిసి సంఘీభావం తెలియజేశారు. అనంతరం రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేయాలన్నారు. నాయకులు వెంకటేష్, పవన్, సత్తార్, శ్రీశైలం, వివేక్, మల్లేశం, జీషాన్, గోపాలకృష్ణ, రాఘవేంద్రాచారి, రాములు తదితరులు సత్యాగ్రహ దీక్షకు తరలివెళ్లిన వారిలో ఉన్నారు.