
ఏటీసీ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు మెండు
తాండూరు: ఏటీసీ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయని తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన పట్టణ శివారులో రూ.85 కోట్ల నిధులతో ఏర్పాటు చేసిన అడ్వాన్ ్డ్స టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు సాంకేతిక విద్య, టెక్నికల్ విద్యా ప్రమాణాలను మెరుగు పరిచేందుకు ప్రభుత్వం ఏటీసీలను ప్రారంభించిందన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి కళాశాలలో బోధన ప్రారంభమైందని చెప్పారు. ఈ సందర్భంగా ఐటీఐ ఏటీసీ కేంద్రం ఏర్పాటు కృషి చేసిన ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు హబీబల్‌లాల నాయకులు అబ్దుల్ రవూఫ్, సర్దార్‌ఖాన్, ప్రభాకర్‌గౌడ్, రామకృష్ణ, మలప్ప, వేణుగోపాల్, శ్రీనివాస్, సంతోశ్‌కుమార్, సత్యమూర్తి, గాజుల మాధవి తదితరులున్నారు.
తాండూరు ఏఎంసీ చైర్మన్ బాల్‌రెడ్డి