
‘లక్నాపూర్’కు నిధులు కేటాయించాలి
పరిగి: లక్నాపూర్ ప్రాజెక్టు మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కోరారు. ఆదివారం ఆయన మండల పరిధిలోని లక్నాపూర్ ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ కొండా మాట్లాడుతూ.. లక్నాపూర్ ప్రాజెక్టు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు అనువుగా ఉందని ఇందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జాలర్లకు చేపల వేటకు కావాల్సిన అధునాత పరికరాలు అందించేలా చూస్తానన్నారు. చేపలను మార్కెటింగ్ చేసుకునేందుకు పరిగి పట్టణ కేంద్రంలోనే మార్కెట్‌ను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు పరమేశ్వర్‌రెడ్డి, మండల అధ్యక్షురాలు అనసూయ తదితరులు పాల్గొన్నారు.
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి