యువత ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరాలి | - | Sakshi
Sakshi News home page

యువత ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరాలి

Aug 25 2025 9:15 AM | Updated on Aug 25 2025 9:15 AM

యువత ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరాలి

యువత ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరాలి

మోమిన్‌పేట: ప్రతీ ఒక్కరు దేశ భక్తి కలిగి ఉండాలని పాలమూరు విభాగ సహ కార్యవిహ కెరెళ్లి అనంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో మోమిన్‌పేట, మర్పల్లి మండలాల స్వయం సేవకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ భక్తితో పాటు హైందవ ధ్మర్మం కాపాటడంలో యువత ముందుండాలన్నారు. యువత అర్‌ఎస్‌ఎస్‌లో చేరాలని పిలుపునిచ్చారు. ఈ శాఖలో చేరడం ద్వారా క్రమశిక్షణ, దేశ భక్తి పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. దేశంలో యుద్ధాలు, కరువులు, ప్రకృతి ప్రకోపించినప్పుడు మేమూ ఉన్నామని ఆర్‌ఎస్‌ఎస్‌ ముందుండి సహయం చేసిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యకరిణి వెంకటయ్య, మోమిన్‌పేట, మర్పల్లి స్వయం సేవకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పాలమూరు విభాగ సహ కార్యవిహ అనంత్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement