
ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహించుకోవాలి
ఇబ్రహీంపట్నం: వినాయక ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి సూచించారు. శనివారం ఓ ఫంక్షన్ హాల్‌లో డివిజన్ స్థాయిలో గణేశ్ ఉత్సవాల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీసీపీ సునీతారెడ్డి మాట్లాడుతూ.. ఉత్సవ కమిటీ నిర్వాహకులు జాగ్రత్తలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలన్నారు. శాంతియుతంగా నిమజ్జన శోభాయాత్ర నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ సత్యనారాయణ, ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, ఆర్డీఓ అనంతరెడ్డి, మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణరెడ్డి, ఇబ్రహీంపట్నం, మంచాల, ఫార్మాసిటీ, ఆధిబట్ల, మాడ్గుల సీఐలు, విద్యుత్ ఏఈ, ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి