
బాలికల రక్షణకే షీటీం
ఎస్‌ఐ ప్రవీణ్
అనంతగిరి: బాలికల రక్షణ కోసమే షీటీం పని చేస్తుందని ఎస్‌ఐ ప్రవీణ్ అన్నారు. శనివారం వికారాబాద్ కేజీబీవీలో షీటీం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలిక లు కష్టపడి చదివి ఉన్నతంగా ఎదగాలని ఆకాక్షించారు. ఈవ్‌టీజింగ్‌కు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. పబ్లి క్ ప్రదేశాల్లో షీటీం పోలీసులు మఫ్టీలో నిఘా ఉంచుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలోలో ప్రిన్సిపాల్ స్వరూప, సిబ్బంది బుచ్చేందర్, రేష్మ, అశోక్ తదితరులు పాల్గొన్నారు.