
ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉత్తమ బోధన
డిప్యూటీ డీఎంహెచ్‌ఓ రవీందర్ యాదవ్, ఎంఈఓ రాంరెడ్డి
దుద్యాల్: ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉత్తమ బోధన, మౌలిక సదుపాయాలు ఉంటాయని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ రవీందర్ యాదవ్, ఎంఈఓ రాంరెడ్డి అన్నారు. శనివారం సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో కొడంగల్ మండల పరిధిలోని ఉడిమేశ్వరం, అంగడిరాయిచూర్, ధర్మపూర్, టేకుల్‌కోడ్, అన్నారం, పాటిమీదిపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్లేట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాల ఉపాధ్యాయులు, సత్యసాయి సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఇంటిపై గంజాయి మొక్కల సాగు
నిందితుడికి రిమాండ్
మోమిన్‌పేట: ఇంటి డాబాపై గంజాయి మొక్కలు సాగు చేస్తున్న వ్యక్తిని రిమాండ్‌కు తరలించినట్లు ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ ఎస్‌ఐ సహదేవుడు తెలిపారు. గ్రామానికి చెందిన బూర్జుగడ్డ మహ్మద్ ఫతేబాబా తన ఇంటిపై రెండు గంజాయి మొక్కలు సాగు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు శనివారం తమ సిబ్బందితో వెళ్లి రెండు మొక్కలు సాగు చేసినట్లు గుర్తించాం. వాటిని స్వాధీనం చేసుకుని ఫతేబాబాను రిమాండ్‌కు తరలించామని ఎకై ్సజ్ పోలీసులు తెలిపారు.
శనీశ్వర ఆలయంలో ఎమ్మెల్యే పూజలు
నవాబుపేట: మోమిన్‌పేట్ మండలం ఎన్కతల గ్రామంలో వెలసిన శనీశ్వర ఆలయంలో పొలాల అమావాస్యను పురస్కరించుకొని శనివారం ఎమ్మెల్యే కాలె యాదయ్య ప్రత్యేక పూజలు చేశారు. నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు.
టాక్టర్‌ను ఢీకొట్టిన బైక్
ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు
పరిగి: ఇనుప చువ్వలు తరలిస్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి బైక్ ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన శనివారం రాత్రి మండల పరిధిలోని రూప్‌ఖాన్‌పేట గేటు వద్ద జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారంగాజులకుంట తండాకు చెందిన రాములు నాయక్ మండల కేంద్రం నుంచి ఇంటికి వెళ్తున్నాడు. ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను గమనించకపోవడంతో బైక్‌తో ట్రాక్టర్‌ను ఢీకొట్టి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని వెంటనే పరిగి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇదే విషయమై పోలీసులను సంపద్రించగా ప్రమాద విషయమై ఎటువంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు.
ఇసుక ట్రాక్టర్ సీజ్
బొంరాస్‌పేట: నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టరును పోలీసులు సీజ్ చేశారు. ఎస్సై బాల వెంకటరమణ తెలిపిన ప్రకారం.. మహంతీపూర్‌కు చెందిన తిరుపతి లాలప్ప శనివారం తన ట్రాక్టరులో వాగునుంచి అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తుండగా పోలీసులు జానకంపల్లి వద్ద పట్టుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉత్తమ బోధన

ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉత్తమ బోధన

ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉత్తమ బోధన