
నాలుగు లేన్ల రోడ్లకు ప్రత్యేక కృషి
పరిగి: రాష్ట్రంలోని నలుమూలల నుంచి నాలుగు లేన్ల రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. అప్ప జంక్షన్ నుంచి మన్నేగూడ వరకు జరుగుతున్న నేషన్ హైవే విస్తరణ పనులను శుక్రవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రూ.1,050 కోట్లతో పనులు చేపట్టినట్లు వివరించారు. హైవే నిర్మాణానికి అన్ని అడ్డంకులు తొలిగా యన్నారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న మర్రి చెట్ల విషయంలో గ్రీన్ ట్రిబ్యూనల్‌లో కేసు వేసిన పర్యావరణ వేత్తలు కేసు ఉపసంహరించుకుంటామని హామీ ఇచ్చారన్నారు. మన్నేగూడ నుంచి రావులపల్లి వరకు రూ.1,000 కోట్లతో నాలుగు లేన్ల రహదారి మంజూరైందన్నారు.
క్రీడలతో మానసిక ప్రశాంతత
కుల్కచర్ల: క్రీడలతో మానసిక ప్రశాంతత పొందవచ్చని ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కుల్కచర్లలో జోనల్ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ క్రీడలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఎంపీఓ భాస్కర్ గౌడ్ తన తల్లి ఈడిగి యాదమ్మ జ్ఞాపకార్థంతెచ్చిన దుస్తులను ఎమ్మెల్యేతో క్రీడాకారులకు అందజేశారు.
ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి