
వేగంగా అభివృద్ధి పనులు
దుద్యాల్: ప్రభుత్వ అభివృద్ధి పనుల నిర్మాణాలు వేగంగా కొనసాగించాలని కడా ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి సూచించారు. శుక్రవారం మండల పరిధిలోని హకీంపేట్ గ్రామంలోని కొనసాగుతున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ నిర్మాణ నామునాను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల వ్యాప్తంగా జరుగుతున్న నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, త్వరగా భవనాలు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లకు సూచించారు. కార్యక్రమంలో పంచాయత్ రాజ్ ఏఈ సురేందర్‌రెడ్డి, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, సంజీవరెడ్డి, నరేందర్‌రెడ్డి, శ్రీనివాస్, సాయిలు, రాజు పాల్గొన్నారు.
కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి