
ఫోర్జరీ కేసులో కొనసాగుతున్న విచారణ
తాండూరు: తెలంగాణ గ్రామీణ బ్యాంకులో మహిళ దాచుకున్న ఫిక్స్‌డ్ డిపాజిడ్ డబ్బులను ఫోర్జరీ చేసిన ఘటనలో విచారణను వేగవంతం చేశామని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తెలిపారు. శుక్రవారం డీఎస్పీ, బ్యాంకు మేనేజర్‌లు వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు. తాండూరు ప్రాంతానికి చెందిన విశాలాక్షి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో 2008లో రూ.2.89 లక్షలు డిపాజిట్ చేసిందన్నారు. మూడేళ్ల తర్వాత అదే బ్యాంకులో మరో రూ.3.15 లక్షలను డిపాజిట్ చేసిందన్నారు. బాండ్‌ల గడువు ముగియడంతో డబ్బులను తీసుకొనేందుకు గత నెల 29వ తేదీన మహిళ బ్యాంకుకు కోరడంతో అక్రమాలు వెలుగులోకి వచ్చిందన్నారు. అప్పట్లో డెక్కన్ గ్రామీణ బ్యాంకుగా సేవలు అందిస్తోంది. ఆన్‌లైన్ విధానం రావడంతో ప్రస్తుతం డిజిటల్ లావాదేవీలు కొనసాగుతున్నాయన్నారు. 2022 వరకు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ప్రేమ్‌సింగ్‌పై అనుమానం రావడంతో ఫిర్యాదు స్వీకరించి విచారణ చేస్తున్నామన్నారు. త్వరలోనే పూర్తి వివరాలను తెలియజేస్తామని అధికారులు తెలిపారు.
డీఎస్పీ బాలకృష్ణారెడ్డి