
నీటి ఎద్దడికి ముందస్తు చర్యలు
యాలాల: నీటి ఎద్దడి రాకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా నూతన బోరును వేయించినట్లు ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ ప్రభాకర్ తెలిపారు. శుక్రవారం మండలంలోని ముద్దాయిపేటలో స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి పనుల జాతరలో భాగంగా కొత్తగా వేసిన బోరుకు మోటారు బిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి మంజూరు చేసిన డీఎంఎఫ్‌టీ రూ.2.50లక్షక్షల నిధులతో గ్రామంలో కొత్త బోరు, మోటారు ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కిరణ్‌కుమార్, నాయకులు ఆరిఫ్ హుస్సేన్, వెంకటయ్యగౌడ్, మురళీగౌడ్, గోపాల్‌నాయక్, వాటర్‌మెన్ ఫరీద్ తదితరులు ఉన్నారు.