
గణేశ్ ఉత్సవాల్లో పొరపాట్లు జరగొద్దు
తాండూరు: వినాయక చవితి ఉత్సవాల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ అధికారులకు సూచించారు. శుక్రవారం తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, హిందూ ఉత్సవ సమితి ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా మండపాలు ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు స్వప్న పరిమళ్, కార్యదర్శి పట్లోళ్ల నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్