మండపాలకు అనుమతులు తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

మండపాలకు అనుమతులు తప్పనిసరి

Aug 23 2025 6:23 AM | Updated on Aug 23 2025 6:23 AM

మండపా

మండపాలకు అనుమతులు తప్పనిసరి

మండపాలకు అనుమతులు తప్పనిసరి పోలీస్‌ కస్టడీలో బీఆర్‌ఎస్‌ నేత! పాంబండలో పాము కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పండి ఇళ్ల నిర్మాణాలను వేగం చేయాలి నిషేధిత పొగాకు పట్టివేత

బంట్వారం ఎస్‌ఐ విమల

బంట్వారం: గణేశ్‌ మండపాలకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని బంట్వారం ఎస్‌ఐ విమల పేర్కొన్నారు. శుక్రవారం ఆమె పోలీస్‌ స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడారు. ఉత్సవ కమిటీలు పోలీసుల నియమాలను పాటించాలన్నారు. మండపాల ఏర్పాటుకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలన్నారు. ఊరేగింపు సమయంలో ట్రాఫిక్‌ రూల్స్‌తో పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలన్నారు. ప్రత్యేకంగా డీజేలకు అనుమతిలేదన్నారు. విద్యుత్‌ కనెక్షన్ల కోసం ట్రాన్స్‌కో అధికారుల అనుమతి ఉండాలన్నారు. మండపాల్లో అనుమానిత బ్యాగులు, ప్లాస్టిక్‌ సంచులు ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

దోమ: అక్రమ మైనింగ్‌ కేసులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న బీఆర్‌ఎస్‌ నేత, దోమ జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కోప్పుల నాగిరెడ్డిని విచారణలో భాగంగా పోలీసులు ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నారు. గురువారం మొదటి రోజు చన్గోముల్‌ పీఎస్‌కు తీసుకువచ్చిన ఆయనను అక్రమ మైనింగ్‌ ఎలా తీశారు? అనే కోణంలో తన తరఫు లాయర్ల సమక్షంలో పోలీసులు విచారణ చేశారు. శుక్రవారం సీన్‌ రీ కన్‌న్‌స్ట్రక్షన్‌లో భాగంగా పోలీసులు దిర్సంపల్లికి తీసుకువచ్చారు. ఏ ఏ ప్రాంతంలో మైనింగ్‌ జరిపారు? ఎంత మేరకు తీశారు? అనే కోణంలో ప్రశ్నించారు. తదనంతరం అక్కడి నుంచి పీఎస్‌కు తరలించారు.

కుల్కచర్ల: మండల పరిధిలోని బండవెల్కిచర్లలో ప్రసిద్ధిగాంచిన శ్రీ పాంబండ దేవాలయంలో ఓ పాము ప్రత్యేక్షమైంది. శుక్రవారం నాగుపాము ఆలయంలోనికి ప్రవేశించి పడగ విప్పింది. దీంతో ఆలయానికి మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చిన భక్తులు ముందుగా భయభ్రాంతులకు గురికాగా, ఆ తర్వాత పాము పడగ విప్పడంతో మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలోకి సర్పం రావడంతో నిష్టతో భక్తులు పూజలు చేశారు. కొద్దిసేపటికి ఆలయ సిబ్బంది పామును పట్టుకొని అటవీ ప్రాంతంలో వదిలేశారు.

బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి

ధారూరు: బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలని బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి సూచించారు. మండలంలోని కుక్కింద గ్రామంలో శుక్రవారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతు, ప్రజా సమస్యలను కాంగ్రెస్‌ గాలికి వదిలివేసిందన్నారు. ఆరు గ్యారంటీల అమలులో విఫలమైందని ఆరోపించారు. సమావేశంలో నాయకులు భీంసేన్‌చారీ, లక్ష్మయ్య, వేణుగోపాల్‌రెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు.

పూడూరు: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని డీఎల్‌పీఓ సంధ్యారాణి తెలిపారు. శుక్రవారం మండల పరిధిలోని ఎన్కేపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ప్రభుత్వం పైలెట్‌ ప్రాజెక్టుగా తీసుకుని రెండు వందలకు పైగా ఇళ్లను మంజూరు చేసిందన్నారు. ప్రతిఒక్కరూ హౌసింగ్‌ అధికారులు ఇచ్చిన కొలతల ప్రకారం నిర్మాణాలు చేపట్టాలని లబ్ధిదారులకు సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, లబ్ధిదారులు ఉన్నారు.

ఇబ్రహీంపట్నం రూరల్‌: నిషేధిత పొగాకు విక్రయాలపై ఎస్‌ఓటీ, ఆదిబట్ల పోలీసులు దాడి చేశారు. భారీ ఎత్తున పొగాకు, గుట్కా నిల్వలను సీజ్‌ చేశారు. ఈ ఘటన ఆదిబట్ల ఠాణా పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఆదిబట్ల పోలీసులు తెలిపిన ప్రకారం.. మున్సిపాలిటీ పరిధిలోని బొంగ్లూర్‌ ఎక్స్‌రోడ్డు వద్ద మాతాజీ కిరాణం జనరల్‌ స్టోర్‌లో అక్రమంగా నిషేదిత గుట్కా విక్రయిస్తున్నారనే సమాచారంతో మహేశ్వరం జోన్‌ ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేశారు. నిషేధిత పాన్‌మసాల నిల్వలను సీజ్‌ చేశారు. బొల్లారం కుమావత్‌, రాజ్‌కుమార్‌లపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

మండపాలకు అనుమతులు తప్పనిసరి 
1
1/3

మండపాలకు అనుమతులు తప్పనిసరి

మండపాలకు అనుమతులు తప్పనిసరి 
2
2/3

మండపాలకు అనుమతులు తప్పనిసరి

మండపాలకు అనుమతులు తప్పనిసరి 
3
3/3

మండపాలకు అనుమతులు తప్పనిసరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement