
ధర్నాను విజయవంతం చేయండి
తాండూరు రూరల్: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లో నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని పీఆర్‌టీయూ తాండూరు మండల అధ్యక్ష, కార్యదర్శులు జొన్నల వినోద్‌కుమార్, పురుషోత్తరంరెడ్డిలు పేర్కొన్నారు. బెల్కటూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మహాధర్నాకు సంబంధించి పోస్టర్‌ను విడుదల చేశారు. పాత సీపీఎస్ విధానం కొనసాగించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లో నిర్వహించే ధర్నాకు ఉపాధ్యాయులు తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీఆర్‌టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రాంనర్సిహారెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
సీపీఎస్‌ను రద్దు చేయాలి
దోమ: సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని పీఆర్‌టీయూ మండల అధ్యక్షుడు ఆర్.కేశవులు డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో సీపీఎస్ విద్రోహ దినాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ నగరంలోని ఇందిరాపార్క్ దగ్గర సెప్టెంబర్ 1వ తేదీన జరిగే మహాధర్నా వాల్‌పోస్టర్ ఆ సంఘం నేతలతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో ప్రవేశపెట్టిన సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను వెంటనే అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయుల బృందం తదితరులు పాల్గొన్నారు.