
భారతి సిమెంట్‌కు తిరుగులేదు
తాండూరు: భారతి అల్ట్రాఫాస్ట్ సిమెంట్‌తో నిర్మాణాల వేగంగా పూర్తవుతాయని ఆ సంస్థ టెక్నికల్ మేనేజర్ సునీల్ తెలిపారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని దుర్గా గ్రాండర్‌లో సబ్ డీలర్‌లకు భారతి సిమెంట్ అల్ట్రాఫాస్ట్ పేరుతో ఫాస్ట్ సెట్టింగ్ 5 స్టార్ గ్రేడ్‌తో తెలంగాణ రాష్ట్రంలో విడుదల చేసిన సిమెంట్‌పై డీలర్‌లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్కెట్‌లో లభించే ఇతర సిమెంట్‌తో పోలిస్తే భారతి అల్ట్రాఫాస్ట్ సిమెంట్‌తో నిర్మాణ ప్రక్రియ చాలా వేగంగా పూర్తవుతోందన్నారు. ప్రధానంగా స్లాబులకు, పిల్లర్లు, బ్రిడ్జిలు, రహదారులకు ఎంతో మన్నికగా ఉంటుందన్నారు. అల్టాఫాస్ట్ సిమెంట్ వినియోగదారులకు ఉచిత సాంకేతిక సహాయం అందిస్తామన్నారు. స్లాబ్ కాంక్రీట్ సమయంలో నిష్ణాతులైన ఇంజినీర్లను సైట్ వద్దకే వచ్చి సహయ పడతారన్నారు. అనంతరం డీలర్‌లు మాట్లాడుతూ.. భారతి సిమెంట్ సంస్థ ప్రతినిధులు సేవలు చాలా పాస్ట్‌గా ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో సంస్థ మార్కెటింగ్ మేనేజర్ సతీష్ రాజు, అసిస్టెంట్ మార్కెటింగ్ మేనేజర్ వీరాంజనేయరెడ్డి, టెక్నికల్ ఇంజినీర్ సామ్రాట్, భారతి సిమెంట్ డీలర్‌లు తదితరులు పాల్గొన్నారు.
సంస్థ టెక్నికల్ మేనేజర్ సునీల్