
పారిశుద్ధ్యం లోపిస్తే వ్యాధుల విజృంభణ
తాండూరు: పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని తాండూరు మున్సిపల్ కమిషనర్ బి.యాదగిరి అన్నారు. శుక్రవారం మున్సిపల్ పరిఽధిలోని సాయిపూర్, 11వ వార్డు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. 100 రోజుల ప్రణాళిక పనుల్లో భాగంగా పారిశుద్ధ్య పనులను కార్మికులతో ముందుండి చేయించారు. మురుగు కాల్వల్లో చెత్త లేకుండా నిత్యం శుభ్రం చేయాలన్నారు. వర్షాకాల సీజన్ కావడంతో పారిశుద్ధ్యం లోపిస్తే సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రజలు తడి, పొడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య సిబ్బందికి అందించాలన్నారు. వీధుల్లో చెత్త వేసి పరిసరాలను అపరిశుభ్రంగా మార్చకుండా సహకరించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఉమేష్, మున్సిపల్ ఎన్విరాన్‌మెంట్ ఇంజినీర్ ప్రవీణ్, పారిశుద్ధ్య విభాగం సిబ్బంది శ్రీనివాస్, వీరన్న పాల్గొన్నారు.
తాండూరు మున్సిపల్ కమిషనర్ యాదగిరి