చికిత్స పొందుతూ రైతు మృతి | - | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ రైతు మృతి

Aug 22 2025 6:57 AM | Updated on Aug 22 2025 6:57 AM

చికిత్స పొందుతూ  రైతు మృతి

చికిత్స పొందుతూ రైతు మృతి

బైక్‌ ఢీకొట్టడంతో ప్రమాదం

బషీరాబాద్‌: రోడ్డు ప్రమాదంలో గాయపడి, చికిత్స పొందుతున్న ఓ రైతు మృతి చెందిన సంఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. బషీరాబాద్‌ ఎస్‌ఐ నుమాన్‌ అలీ, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గొట్టిగకలాన్‌ గ్రామానికి చెందిన మహిమూద్‌(42) ఓ చిన్నకారు రైతు. కొద్దిపాటి పొలంలో కూరగాయలు పండిస్తూ భార్య ఫాతిమాబేగం, నలుగురు పిల్లలను పోషిస్తున్నాడు. మంగళవారం(19న) ఆయన కాయగూరలు విక్రయించడానికి నవల్గా వెళ్లి ఇంటికి వెళుతున్నాడు. ఈ క్రమంలో బొంరాస్‌పేట మండలం కొత్తూరు గ్రామానికి చెందిన రమేశ్‌ బైక్‌పై వేగంగా రావడంతో అదుపుతప్పి మహిమూద్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మహిమూద్‌ తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బంధువులు ఆయన్ని తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఇంటి యజమాన్ని కోల్పోయిన భార్య, తన నలుగురు పిల్లలు దుఖఃసాగరంలో మునిగిపోయారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఇదిలా ఉండగా రమేశ్‌ బైక్‌పై మరో ఇద్దరు ఉన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement