
విత్తన మట్టి విగ్రహాల పంపిణీ
తాండూరు: వినాయక చవితి పండగ రోజు మట్టితో చేసిన విత్తన విగ్రహాలను పూజిస్తే వృక్ష సంపద పెంచడంతో పాటు సమాజ హితానికి మేలు జరుగుతోందని రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు నూలి శుభప్రద్‌పటేల్ అన్నారు. గురువారం గ్రీన్ ఇండి యా చాలెంజ్ హరిత సేన సంస్థ సౌజన్యంతో తాండూరు పట్టణంలోని ఎన్‌ఎస్‌పీ ట్రస్ట్ చైర్‌పర్సన్ శివాని, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్లు తాటికొండ స్వప్నపరిమళ్, విజయలక్ష్మి స్థానికులకు మట్టితో తయారు చేసిన విత్తన గణపతి విగ్రహాలను పంపి ణీ చేశారు. పండగపూట అందరూ మట్టితో చేసిన వినాయక ప్రతిమలనే వినియోగించాలని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో తాండూరు లెక్చరర్ ఫోరం అధ్యక్షుడు సోమనాథ్, ప్రైవేట్ స్కూల్ అసో షియేషన్ కార్యదర్శి మోహన్‌కృష్ణాగౌడ్, అసోషియేషన్ ప్రతినిధులు, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.