
గల్లా ఎగరేస్తున్న గల్లీ లీడర్స్!
లేదంటే బ్లాక్ మెయిల్ రాజకీయాలతో బెదిరింపులు హడలిపోతున్న అధికారులు, ద్వితీయ శ్రేణి నాయకులు
ధారూరు: జిల్లాలోని అధికార పార్టీకి చెందిన కొంతమంది గల్లీ లీడర్లు అధికారులు, ద్వితీయ శ్రేణి నేతలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. పలువురు ప్ర ముఖ నాయకులతో వీరికున్న సంబంధాన్ని చూసి అధికారులు సైతం వీరంటే జడుసుకుంటున్నారు.
నా ఊరిలో నా మాటే చెల్లాలి..
బషీరాబాద్: మండలానికి చెందిన ఓ లీడర్ వ్యవహారం రాజకీయ, అధికారవర్గాలను ఆందోళనకు గురి చేస్తోంది. తన పనులు చేయించుకునేందుకు అధికారులతో పాటు తమనే బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని సొంత పార్టీ నాయకులే ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు డీసీసీ అధ్యక్షుడితో పాటు స్థానిక ఎమ్మెల్యేకూ ఫిర్యాదు చేసినా అతని తీరు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా ఊళ్లో నా మాటే చెల్లాలి.. రాజకీయ పరంగా, అభివృద్ధి పనుల్లో మండల నాయకులు, అధికారులు నేను చెప్పిందే వినాలి. లేదంటే అడ్డుపడిన వారి పేర్లు రాసి ఆత్మహత్య చేసుకుంటా.. అంటూ బెదిరింపులకు పాల్పడటంపై అధికారులు, నేతలు విస్తుపోతున్నారు. ఈ గొడవల్లోకి ఎమ్మెల్యే స్థాయి నాయకులను సైతం లాగాలని చూశాడని మండల నాయకులు గుర్రుగా ఉన్నారు. ఇదే లీడర్ నెల రోజుల క్రితం బతికున్న ఓ రైతు చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్ సృష్టించి, అతని భూమిని కొల్లగొట్టేందుకు ప్రయత్నించాడనే ఆరోపణలున్నాయి. భూమి బదలాయింపు కోసం అధికారులపై ఒత్తిడి తెచ్చినా.. సకాలంలో వారు మేలుకొని పొరపాటును సరిదిద్దుకున్నారు. ఇతనిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరుతూ కార్యకర్తలూ, నాయకులు పార్టీ పెద్దలకు విన్నపాలు అందించడం చర్చనీయాంశమైంది.
తాము చెప్పిందే చేయాలంటూ అల్టిమేటం