పూడూరు: మండలంలోని కంకల్ గ్రామానికి చెందిన జియా ఉర్ రెహ్మన్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఫిజిక్స్‌లో డాక్టరేట్ పట్టా పొందారు. ఇస్రో చైర్మన్ నారాయణ్, వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ కుమార్ చేతుల మీదుగా పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు.
ఉచిత ఉపకరణాలకు దరఖాస్తు చేసుకోండి : ఐఈఆర్‌పీ వేణుగోపాల్
బొంరాస్‌పేట: జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రత్యే క అవసరాలు కలిగిన దివ్యాంగులైన విద్యార్థులకు అలింకో సంస్థ వారు పలురకాల ఉపకరణాలు ఉచితంగా అందిస్తున్నారని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఐఈఆర్‌పీ వేణుగోపాల్ తెలిపారు. గురువారం ఆయన మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. 18 సంవత్సరాలలోపు వారు, 40శాతం వికలత్వం గల విద్యార్థులు అర్హులన్నారు. అందుకు ఆధార్ కార్డు, సదరం సర్టిఫికెట్, యూడీఐడీ కార్డు, ఆదాయ ధ్రువపత్రాలను మండల కేంద్రంలోని ఐఈఆర్‌సీ (భవిత) సెంటర్‌లో అందజేశాయాలన్నారు. దరఖాస్తు చేసుకున్నవా రికి ఈ నెల 29న వికారాబాద్‌లోని ఎమ్మార్సీ వద్ద ప్రత్యేక క్యాంపు ఉంటుందన్నారు. ఇతర వివరాలకు సెల్ నంబర్ 9603875349లో సంప్రదించాలని ఆయన సూచించారు.
ఫీవర్ సర్వే చేయాలి డీఎంహెచ్‌ఓ లలితాదేవి
యాలాల: భారీ వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఎప్పటికప్పుడు ఫీవర్ సర్వే చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి లలితాదేవి సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో పెరుగుతున్న మలేరియా, చికెన్‌గున్యా, డెంగీ, టైఫాయిడ్ తదితర జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. లేబర్ రూంను విని యోగంలోకి తేవాలన్నారు. ప్రతి రోజూ ఎంతమందికి పరీక్షలు చేస్తున్నారు? ఎన్ని రకాల పరీక్షలు చేస్తున్నారని ల్యాబ్ టెక్నీషియన్ భారతిని అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో ఆస్పత్రికి దగ్గుతో వచ్చిన ఓ వృద్ధుడికి టీబీ పరీక్షలు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో పల్లె దవాఖాన డాక్టర్ స్రవంతి, పీహెచ్‌ఎన్ విజయసుశీల, సూపర్‌వైజర్ శోభారాణి, ఏఎన్‌ఎంలు శ్రీదేవి, జగదీశ్వరి, సంగీత సిబ్బంది బసయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
రాంచందర్‌రావు వ్యాఖ్యలు అర్థరహితం
బంట్వారం: రాజకీయ రంగంలో బీసీ రిజర్వేషన్లపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు వికారాబాద్‌లో చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ జగన్నాథంయాదవ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశ జనాభాలో 56 శాతం బీసీలు ఉన్నారనే విషయాన్ని రాంచందర్‌రావు గుర్తుంచుకోవాలన్నారు. బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లోపు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
భక్తిశ్రద్ధలతో భజన
అనంతగిరి: శ్రావణమాసాన్ని పురస్కరించుకు ని వికారాబాద్ సమీపంలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో గురు వారం అక్కమహాదేవి సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు చేశారు. అనంతరం సామూహిక భజన చేసి శివపార్వతుల పాటలను ఆలపించారు. కార్యక్రమంలో పలువురు మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

కంకల్ వాసికి డాక్టరేట్ పట్టా