
మున్సిపల్ అభివృద్ధికి కృషి
తాండూరు: తాండూరు మున్సిపల్ కమిషనర్‌గా బి.యాదగిరి నియమితులయ్యారు. ప్రభుత్వం బుధవారం రాత్రి రాష్ట్ర వ్యాప్తంగా 47 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఖమ్మం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీలో పనిచేస్తూ వెయిటింగ్‌లో ఉన్న యాదగిరిని తాండూరుకు బదిలీ చేశారు. గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న విక్రమ్‌సింహారెడ్డి కొంత కాలంగా తాండూరు ఇన్‌చార్జ్ కమిషనర్‌గా వ్యవహరిస్తూ వచ్చారు. రెండు రోజుల క్రితం మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు చేయగా సీనియర్ అసిస్టెంట్ రమేష్ పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇన్‌చార్జ్ కమిషనర్ విక్రమ్‌సింహారెడ్డిని తప్పించడం చర్చనీయాంశమైంది. గురువారం ఆయన రిలీవయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిషనర్ యాదగిరి మాట్లాడుతూ.. మున్సిపల్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. పౌర సేవలను మరింత మెరుగు పరుస్తామన్నారు. అవినీతి, అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా సేవలు అందిస్తామని చెప్పారు.
మున్సిపల్ కమిషనర్,
మేనేజర్‌కు ఏసీబీ మెమోలు
గత గురువారం వరకు తాండూరు మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసిన విక్రంసింహారెడ్డి, మేనేజర్ నరేందర్‌రెడ్డికి గురువారం ఏసీబీ మెమోలు జారీ అయ్యాయి. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు మున్సిపల్ కార్యాలయానికి చేరాయి.