
నానో యూరియాపై అవగాహన కల్పించండి
● ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి
● ఎరువుల దుకాణాల్లో తనిఖీలు
దుద్యాల్: నానో యూరియా వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎరువుల దుకాణాదారులకు పలు సూచనలు చేశారు. ద్రవరూప యూరియా వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించాలని సూచించారు. మండలంలో ఎరువుల కొరకు లేకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి రాజరత్నం, కొడంగల్ ఏడీఏ శంకర్ రాథోడ్, మండల వ్యవసాయ అధికారి నాగరాజు, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం యజమాని ఫరీద్ తదితరులు పాల్గొన్నారు.
సస్యరక్షణ చర్యలు చేపట్టాలి
కొడంగల్ రూరల్: వరుస వర్షాల నేపథ్యంలో రైతులు పంట పొలాల్లో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి సూచించారు. బుధవారం పట్టణంలోని ఎరువుల దుకాణాల్లో తనిఖీలు చేశారు. నానో యూరియా వాడేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఏఈ ఓలు రాజు రాథోడ్, శ్రీపతిరెడ్డి పాల్గొన్నారు.