
భక్తిశ్రద్ధలతో శత రుద్రాభిషేకం
అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని శ్రీ మల్లికార్జున భవనంలో శ్రావణమాసాన్ని పురస్కరించుకుని మంగళవారం లోక కల్యాణార్థం తెలంగాణ అర్చక జంగమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 108 మంది అర్చకుల సమక్షంలో మహన్యాస పూర్వక శత రుద్రాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు చేశారు. డాక్టర్ ముద్ద భక్తవత్సలం దంపతులు ఈ కార్యక్రమం జరిపించారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, ఇతర నాయకులు పాల్గొని తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. కార్యక్రమంలో ప్రముఖ వేదపండితులు సాంబశివశర్మ, డాక్టర్ మహంతయ్య, నాగయ్య స్వామి, ప్రహ్లాద్ సంగయ్య , ఆలయ ప్రధాన అర్చకులు బస్వరాజు తో పాటు ఆయా ఆలయాల జంగమ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.