
మార్కెట్ అభివృద్ధికి కృషి
మర్పల్లి: మర్పల్లి వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని చైర్మన్ వై మహేందర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక కార్యాలయంలో పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ముందుగా మార్కెట్ కార్యదర్శి వెంకటేశ్వర్‌రెడ్డి ఆదాయ వ్యయాలు చదివి వినిపించారు. అనంతరం అభివృద్ధిపై సభ్యులు చర్చించారు. మోమిన్‌పేట్, బంట్వారం మండలాల్లో నిర్వహిస్తున్న మేకల సంతకు భూమి కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. మోమిన్‌పేట్‌లో నందివాగు ప్రాజెక్టు పక్కన రెండు ఎకరాల భూమి, బంట్వారం బస్టాండ్ పక్కన ఎకరా భూమి కేటాయించాలని కలెక్టర్‌కు లేఖలు రాసినట్లు చెప్పారు. ఈ విషయమై స్పీకర్ ప్రసాద్‌కుమార్, కలెక్టర్ ప్రతీక్‌జైన్‌తో మాట్లాడి వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. ప్రభుత్వం భూమి కేటాయించగానే మోమిన్‌పేట్, బంట్వారంలో రూ.కోటి చొప్పున రెండు షెడ్లు నిర్మిస్తామని తెలిపారు. అలాగే సాగుకు సరిపడా యూరియా సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో ఏఓ శ్రీకాంత్, వైస్ చైర్మన్ మల్లేశ్ యాదవ్, పాలక వర్గం సభ్యులు పాల్గొన్నారు.
ఏఎంసీ చైర్మన్ మహేందర్‌రెడ్డి