
ఘన స్వాగతం
పూడూరు: వికారాబాద్ పర్యటనకు విచ్చేసిన బీ జేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును మండల నాయకులు ఘనంగా సన్మానించారు. అంగడిచిట్టంపల్లి గేటు వద్ద, మన్నెగూడ చౌరస్తాల్లో శాలువా, గజమాలతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రాఘవేందర్, సినిమా సెన్సార్ బోర్డు సభ్యుడు మల్లే ష్ పటేల్, నాయకులు వెంకటయ్య, రవీందర్, అనీల్, నవీన్‌జోషి తదితరులు పాల్గొన్నారు.
కూరగాయల సాగుపై అవగాహన
యాచారం: మండలంలోని చౌదర్‌పల్లిలో మంగళవారం కూరగాయల పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ, కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం ఆధ్వర్యంలో రైతులకు కూరగాయల సాగుపై అవగాహన కల్పించారు. ఏ సీజన్‌లో ఏవి సాగు చేయాలి, మార్కెట్‌కు తరలింపు, విత్తనాలు, నార్ల ఎంపికలపై అసిస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ అధికారి బసవన్నప్ప వివరించారు.