
వర్షం జోరు.. వరద హోరు
దోమ/ధారూరు: జోరుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రహదారులన్నీ జలమయమై గుంతలు ఏర్పడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. సోమవారం ధారూరు మండల పరిధిలోని రుద్రారం–నాగసమందర్ గ్రామాల మధ్య కోట్‌పల్లి ప్రాజెక్టు అలుగు పారి రోడ్డుపై వరద నీరు ఉధృతంగా ప్రవహించింది. దీంతో రాకపోకలను కొన్ని గంటల పాటు స్తంభింపజేశారు. దోమ మండలం బ్రాహ్మణపల్లిలో వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో అటుగా రాకపోకలు బంద్ అయ్యాయి. అధికారులు వాహనదారులు వెళ్లకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పొలాల్లోకి వరద చేరడంతో పంటలు నీట మునిగాయి.

వర్షం జోరు.. వరద హోరు