
మందులు అందుబాటులో ఉంచాలి
సర్కారు దవాఖానాల్లో కుక్కకాటు చికిత్సకు అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచాలని ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి ఆదేశించారు. పరిగి ఏరియా ఆస్పత్రిలో కుక్కకాటుకు మందు లేదన్న విషయం తెలుసుకున్న ఆయన.. ఆస్పత్రికి వచ్చారు. బాధితులను పరామర్శించి, వైద్యులతో మాట్లాడారు. కుక్కకాటు చికిత్సకు మందులుఅందుబాటులో ఉంచాలన్నారు. జిల్లా వైద్యాఽధికారులతో మాట్లాడి.. సోమవారం నుంచి మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వీఽధి కుక్కల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్‌కు చెప్పారు. ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలు సమకూర్చుతుంటే.. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని హెచ్చరించారు.