
వాజ్‌పేయి ఆశయాలు సాధిద్దాం
అనంతగిరి: దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు మాధవరెడ్డి అన్నారు. శనివారం వికారాబాద్‌లో వాజ్‌పేయి వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివా ళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ.. వాజ్‌పేయి దేశాభివృద్ధిలో తకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని పేర్కొన్నారు. పార్టీ కోసం, దేశం కోసం ఆయన తన జీవితాన్ని త్యాగం చేశారని కొనియాడారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శివరాజు, వడ్ల నందు, సీనియర్ నాయకుడు పాండు గౌడ్, కేపీ రాజు, నరోత్తంరెడ్డి, రాజేందర్‌రెడ్డి, నందు, రాములు, శ్రీనివాస్‌రెడ్డి, రాజేందర్‌గౌడ్, విజయ్‌భాస్కర్‌రెడ్డి, చరణ్‌రెడ్డి, అమర్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
ఏ దేశమేగినా..
పరిగి: పట్టణా నికి చెందిన ముస్లిం మత గురువు మహ మూద్ ఇసాక్‌అలీ దేశభక్తి చాటారు. ఇటీవల సౌదీ వెళ్లిన ఆయన ప్రస్తుతం మదీనే షరీఫ్‌లో ఉన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం జాతీయ జెండాను ప్రదర్శించి, పరిగి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మాతృ భూమిపై మమకారానికి మించిన సంపద లేదన్నారు.
నేడు ‘బాల గోకులం’
కొడంగల్: పట్టణంలోని కేశవ స్వామి ఆలయంలో ఆదివారం బాల గోకులం కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు మురహరి వశిష్ట తెలిపారు. ఉదయం పూజా కార్యక్రమాలు, సాయంత్రం నాలుగు గంటలకు బాలగోకులం,డోలారోహన మహోత్సవ కార్యక్రమం ఉంటుందన్నారు. ఐదేళ్ల లోపు చిన్నారులతో శ్రీ కృష్ణ వేషధారణ పోటీలు నిర్వహించి విజేతలైన 8 మందికి ఒక్కొక్కరికి 5 గ్రాముల చొప్పున వెండి బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
నూతన దంపతులకు ఎమ్మెల్యేల ఆశీర్వాదం
పరిగి: వికారాబాద్ ఎస్పీగా పనిచేసిన నారాయణ కూతురు వివాహం శనివారం నగరంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎమ్మెల్యేలు టి.రామ్మోహన్‌రెడ్డి, కాలె యాదయ్య, బి.మనోహర్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ పట్నం సునీతారెడ్డి మహేందర్‌రెడ్డి తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

వాజ్‌పేయి ఆశయాలు సాధిద్దాం

వాజ్‌పేయి ఆశయాలు సాధిద్దాం