
వర్షపునీరు వెళ్లేందుకు చర్యలు
కేశంపేట: మండల కేంద్రంలో ఉన్న విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట రోడ్డుపై వర్షపునీరు నిలవడంతో వాహనదారులు, విద్యుత్ సిబ్బంది రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు యెన్నం శ్రీధర్‌రెడ్డి అర్‌అండ్‌బీ ఈఈ రవీంద్రకుమార్, అర్‌అండ్‌బీ ఏఈ రాజశేఖర్, ఇన్‌చార్జి ఎంపీడీఓ కిష్టయ్యలతో కలసి వర్షపునీరు నిలిచిన ప్రాంతాన్ని పరిశీలించారు. నీరు వెళ్లేందుకు అనువుగా గతంలో ఉన్న కల్వర్టును పునరుద్ధరించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్ మఠం చంద్రశేఖర్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు నారాయణరెడ్డి, పంచాయతీ కార్యదర్శి విద్యావతిదేవి, కారోబార్ రవి, కోడిపర్తి శ్రీకాంత్‌రెడ్డి, రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.