
అభివృద్ధి, సంక్షేమం
అర్హులందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు రైతులు, మహిళల సంక్షేమానికి పెద్దపీట స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ కలెక్టరేట్‌లో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు అలరించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు
ప్రజాపాలనతో అన్ని వర్గాలకు సమ న్యాయం
వికారాబాద్: ‘రాష్ట్రాన్ని ప్రపంచ వేదికపై సగర్వంగా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.. స్వాతంత్య్ర ఫలాలు, రాజ్యాంగం కల్పించిన హక్కులు.. సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందాలి’ అన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. శుక్రవారం వికారాబాద్ కలెక్టరేట్ ఆవరణలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్పీకర్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. కలెక్టర్ ప్రతీక్‌జైన్, ఎస్పీ నారాయణరెడ్డితో కలిసి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయా స్కూళ్ల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలరించారు. చక్కటి ప్రదర్శన ఇచ్చిన విద్యార్థులకు, విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. పోలీసుల పరేడ్ ఆకట్టుకుంది. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పథకాల అమలు నిరంతర ప్రక్రియ అన్నారు. రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరాకు రూ.12 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. సాగుభూమి లేని పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి రూ.12 వేలు ఇస్తున్నట్లు చెప్పారు. అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలే లక్ష్యంగా సాగుతున్నట్లు వివరించారు. ఆరు గ్యారంటీలను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఉచిత బస్సు ప్రయాణాన్ని నాలుగు కోట్ల మంది మహిళలు ఉపయోగించుకున్నారని తెలిపారు. గ్యాస్ సబ్సిడీ పథకం ద్వారా 1,04,300 సిలిండర్లు పంపిణీ చేసినట్లు వివరించారు. గృహ జ్యోతి పథకం ద్వారా 1,39,812 కుటుంబాలు లబ్ధి పొందాయని తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.47.99 కోట్లు వెచ్చించిందన్నారు. జిల్లాలో 980 మంది రైతులు మరణించగా రైతు బీమా పథకం ద్వారా బాధిత కుటుంబాలకు రూ.49 కోట్లు చెల్లించినట్లు పేర్కొన్నారు. 1,00,358 మంది రైతులు రు ణాలు రూ.849.30 కోట్లను మాఫీ చేసినట్లు తెలిపా రు. జిల్లాకు 13,640 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కా గా 10,885 నిర్మాణాలకు అనుమతి ఇచ్చామన్నా రు. 1,227 మంది లబ్ధిదారులకు బిల్లులు చెల్లించా మని తెలిపారు. అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
విద్య, వైద సేవలపై ప్రత్యేక దృష్టి
ఆరోగ్య శ్రీ పథకాన్ని రూ.10 లక్షల వరకు పెంచామని తెలిపారు. ఈ పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు 25,040 మందికి రూ.65.29 కోట్లతో వైద్య సేవలు అందించామన్నారు. అమ్మా ఆదర్శ పాఠశాల పథకానికి 1,062 స్కూళ్లు ఎంపిక చేసి మౌలిక వసతుల కల్పనకు రూ.17.55 కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. 126 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం సేకరించినట్లు తెలిపారు. జిల్లాలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు. కడా ఏర్పాటు చేసి వెనుకబడిన కొడంగల్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, అడిషనల్ కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్‌చౌదరి, డీఆర్వో మంగిలాల్, ఆర్డీఓ వాసుచంద్ర, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అభివృద్ధి, సంక్షేమం

అభివృద్ధి, సంక్షేమం